For Money

Business News

కోవీషీల్డ్‌: ప్రికాషన్‌ డోస్‌ ధర రూ.600

ముందుజాగ్రత్తగా వేసుకునే కోవిషీల్డ్‌ డోస్‌ (ప్రికాషన్‌ డోస్‌)ను ప్రైవేట్‌ కంపెనీలకు రూ.600 తాము అందిస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇది తాము హాస్పిటల్‌కు అందించే ధర మాత్రేమనని, హాస్పిటల్‌ ఏ ధరకు అందిస్తాయే కోవిన్ (CoWin) యాప్‌ ద్వారా తెలుసుకోవాలని సీరమ్‌ అధినేత అదార్‌ పూనావాలా అన్నారు. 18 ఏళ్ళ దాటినవారు ప్రికాషన్‌ డోస్‌ వేసుకోవడానికి ప్రభుత్వం ఇవాళ అనుమతించింది. ప్రికాషన్‌ డోస్‌ లేదా ప్రయాణం కోసం బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలనుకునేవారికి కేంద్ర నిర్ణయం పెద్ద ఉపశమనమని పూనావాలా అన్నారు. ప్రికాషనరీ డోస్‌కు, రెండో డోస్‌కు మధ్య గడువు 9 నెలల నిర్ణయించడం చూస్తే… వ్యవధి ఎక్కువని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ వద్ద 20 కోట్ల డోస్‌ల స్టాక్‌ ఉందని, ఎవరూ దిగుమతి చేసుకోవడం లేదన్నారు. తాము హాస్పిటల్స్‌కు, క్లినిక్‌లకు సరఫరా చేసిన వ్యాక్సిన్‌కు గడువు పూర్తయితే… ఉచితంగా రీప్లేస్ చేస్తామని అన్నారు.