For Money

Business News

నష్టాల్లో ముగిసిన నిఫ్టి

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఉదయం నుంచి ఎనిమిదిసార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది. మిడ్‌ సెషన్‌ ముందు నిఫ్టి 17462కు క్షీణించింది. తరవాత యూరో మార్కెట్లతో పాటు ఆటోపోట్లకు గురైంది. యూరో మార్కెట్లు ఒక మోస్తారు లాభాలతో ప్రారంభమైనా… కొన్ని మార్కెట్లు నష్టాల్లోకి జారకున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. దీంతో మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టిలో లాభాల్లోకి వచ్చినా… నిలబడ లేదు. వెంటనే నష్టాల్లోకి వచ్చింది. ట్రేడింగ్ చివర్లో షార్ట్‌ కవరింగ్‌ వచ్చినా… ఎంతో సేపు నిలబడలేదు. మొత్తానికి క్రితం ముగింపుతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 17516 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ నిఫ్టి కూడా అర శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌ స్థిరంగా ముగిసినా… మిడ్ క్యాప్‌ నిఫ్టి ఏకంగా 1.5 శాతం క్షీణించింది. దీనికి ప్రధాన కారణం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌తో పాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌ షేర్లు భారీ నష్టాలతో క్లోజ్‌ కావడం.