For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

జూన్‌ నెల డెరవేటివ్స్‌ స్థిరంగా ముగిశాయి. గత కొన్ని రోజులుగా నిఫ్టి పెరిగిన దృష్యాల ఇవాళ ఎలాంటి షార్ట్‌ కవరింగ్ రాలేదు. పైగా చివరల్లో స్వల్ప లాభాల స్వీకరణ జరిగింది. యూరప్‌ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ భారీ నష్టాల్లో ఉన్నా… నిఫ్టి మిడ్‌సెషన్‌ తరవాత 15890ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణతో 15,780 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 19 పాయింట్లు, సెన్సెక్స్‌ 8 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. నిఫ్టి యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. ఈనెలలో దివీస్‌ ల్యాబ్‌ పది శాతంపైగా పెరిగింది. రూ.3365 నుంచి రూ. 3630కి పెరిగింది. డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌ స్థిరంగా క్లోజైనా ఇతర సూచీలు భారీగా పడ్డాయి. నిజానికి ఇవాళ నిఫ్టి 0.47 శాతం లాభంతో ముగిసింది. కాని నిఫ్టి నెక్ట్స్‌ 0.47 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు కోలుకోక పోతే మాత్రం రేపు మన మార్కెట్లకు భారీ నష్టాలు తప్పవేమో!