For Money

Business News

ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ముగిసింది. లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నా.. తరవాత కోలుకుని స్థిరంగా ముగిసింది. ఇటీవల బాగా పెరిగిన ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. మార్కెకట్‌లో లిక్విడిటీ తక్కువ ఉన్న షేర్లలో కృత్రిమంగా ధరలు పెంచడం వినా.. అర్థవంతమైన ట్రేడింగ్‌ కన్పించలేదు. ఇవాళ పేటీఎం మరో పది శాతం పెరిగింది. అప్పర్‌ సీలింగ్‌లో అమ్మకందారులు లేరు. పేటీఎం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేయడం మార్కెట్‌ సానుకూల సంకేతంగా భావించినట్ల ఉంది. నిఫ్టీ 21,930 వద్ద, 72,152 వద్ద ముగిశాయి. నిఫ్టిలో ఎస్‌బీఐ, గ్రాసిం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. టాటా గ్రూప్‌నకు చెందిన టీఆర్‌ఎఫ్‌ షేర్లు ఇవాళ 20 శాతం వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. టాటా స్టీల్‌లో విలీన ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ కంపెనీ షేరు 19.99 శాతం లాభంతో రూ.327.0 వద్ద ముగిసింది. అలాగే ట్రెంట్‌ షేర్‌ 20 శాతం లాభపడింది. ఇక అదానీ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. షేర్ల విభజన అంశాన్ని పరిశీలించేందుకు కెనరా బ్యాంక్‌ బోర్డు ఈనెల 26న భేటీ కానుంది.