For Money

Business News

పేటీఎంకు మరింత గడువు

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌కు ఆర్బీఐ మరో 15 రోజులు గడువు ఇచ్చింది. పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ నోడల్‌ అకౌంట్స్‌ను ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఈ గడువును మరో 15 రొజులు పొడిగిస్తూ ఆర్బీఐ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 15 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లను పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ స్వీకరించరాదు. తాజా గడువు పెంపుతో పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు మరింత సమయం లభించింది. మరోవైపు పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా ఫాస్టాగ్‌ సర్వీసులను ఆపేయాల్సిందిగా ఆధీకృత బ్యాంకులకు నేషనల్ హై వే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.