For Money

Business News

17,000 పైన ముగిసిన నిఫ్టి

మార్కెట్‌ ఏమాత్రం పెరిగినా ఇన్వెస్టర్లు బయటపడటానికి అవకాశంగా భావిస్తున్నారు. ఇవాళ నిఫ్టి ఆరుసార్లు నష్టాల్లోకి జారుకుంది. దీన్ని బట్టి నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిఫ్టి ఆరంభంలో 17176 స్థాయికి చేరినా.. ఆ తరవాత ఆ స్థాయిని అందుకే లేదు. అయితే 16842 కనిష్ఠ స్థాయిని తాకినా… కోలుకుంది. నష్టపోయిన ప్రతిసారీ నిఫ్టికి మద్దతు లభించింది. ఎట్టకేలకు 17000పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పాయింట్ల లాభంతో 17007 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. నిఫ్టిలో 28 షేర్లు గ్రీన్‌లో ముగిసినా.. పలు షేర్లు అధిక నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ ఒత్తిడి నిఫ్టిపై అధికంగా ఉంది. ఈ సూచీ 0.67 శాతం నష్టపోగా, ఫైనాన్షియల్‌ నిఫ్టి 0.98 శాతం నష్టపోయింది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ నష్టంతో క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ కూడా అదానీ గ్రూప్‌ షేర్లలో ఒత్తిడి కన్పించింది. పలు షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఫార్మా షేర్లు ఇవాళ పరవాలేదనిపించాయి. నిఫ్టిలో భారీ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం…. అంతర్జాతీయ మార్కెట్లలో నిలకడ లోపించడం. అమెరికా ఫ్యూచర్స్‌, యూరోపియన్‌ సూచీలు ఆకర్షణీయ లాభాల్లోకి వచ్చినా.. తరవాత చాలా లాభాలను కోల్పోయాయి. అయినా అమెరికా ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ఎల్లుండి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ప్రభావం కూడా మన మార్కెట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది.