For Money

Business News

19700 దిగువన నిఫ్టి

ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటనకు ముందు మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. యూరో మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అయితే కార్పొరేట్‌ ఫలితాలను మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 19782 పాయింట్లను తాకిన నిఫ్టి 19669 పాయింట్ల వద్ద ముగిసింది. హోటల్‌ బిజినెస్‌ను డీ మర్జర్‌ చేసేందుకు ఐటీసీ బోర్డు ఆమోదించిన తరవాత ఆ కౌంటర్‌ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీసీ షేర్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ లూజర్‌.ఈ షేర్‌ ఇవాళ 4 శాతంపైగా నష్టంతో ముగిసింది. వెరశి నిఫ్టి 75 పాయింట్లు నష్టపోయినా… 29 నిఫ్టి షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడంతో రిలయన్స్‌ కూడా భారీగా నష్టపోయింది. బ్యాంక్‌ నిఫ్టి దాదాపు క్రితం వద్దే ముగిసింది. మార్కెట్‌ ఇవాళ ఉదయం ఒక సారి, మిడ్‌ సెషన్‌లో రెండోసారి దిగువస్థాయి నుంచికోలుకుని లాభాల్లోకి వచ్చింది. అయితే చివర్లో వచ్చిన లాభాల స్వీకరణ వల్ల నిఫ్టి నష్టాల్లో ముగిసింది.