For Money

Business News

పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)పై 8.15శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 8.15 శాతం వడ్డీ చెల్లించే ప్రతిపాదనకు కార్మిక శాఖ ఆమోదం తెలిపి ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్‌ పంపారు. తాజగా ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే పీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ చేసేందుకు ఈపీఎఫ్‌ఓ ఏర్పాట్లు చేస్తోంది.