For Money

Business News

కీలకస్థాయి దిగువన నిఫ్టి

ఇవాళ అధిక స్థాయిలను తాకిన నిఫ్టి..ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. ఇవాళ కొత్త వీక్లీ డెరివేటివ్ సెటిల్‌మెంట్‌ నిరుత్సాహంగా ప్రారంభమైంది. ఆటో, ప్రభుత్వ బ్యాంకులు మినహా మిగిలిన షేర్లలో పెద్ద ఆసక్తి లేదు. వార్తల ఆధారంగా కొన్ని షేర్లు పెరిగినా… చాలా మటుకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ఆరంభంలో 19523ని తాకినా.. ఆ స్థాయిలో నిలబడలేదు. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండటంతో మన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరిగినట్లు కన్పిస్తోంది. నిన్న మూడు శాతం దాకా నష్టపోయిన యూరో స్టాక్స్‌ 50 సూచీ కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా రెడ్‌లో ఉండటంతో నిఫ్టిలో లాభాల స్వీకరణ కన్పించింది. రోజాంతా నిరుత్సాహంగా ఉన్న మార్కెట్‌లో చివరి 45 నిమిషాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో నిఫ్టి 19331 వద్ద అటే 19350 దిగువన క్లోజైంది. సెన్సెక్స్‌ కూడా 505 పాయింట్లు నష్టపోయింది. భారీ ఆర్డర్‌ రావడంతో ఒలెక్ట్రా ఇవాళ 18 శాతం పైగా పెరిగి రూ. 1231 వద్ద ముగిసింది. ఇవాళ మీడియా షేర్లలో కూడా ఆసక్తి కన్పించింది. జీ షేర్‌ 9 శాతం దాకా లాభపడింది. ప్రైవేట్‌ బ్యాంకుల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి ఒక శాతం దాకా నష్టపోయింది. నిఫ్టి 0.85 శాతం నష్టపోగా… నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 1.22 శాతం నష్టపోయింది.