For Money

Business News

డినుటక్సిమాబ్‌ దిగుమతిపై నో ట్యాక్స్‌?

క్యాన్సర్‌తో బాధపడేవారికి శుభవార్త. క్యాన్సర్‌ ఔషధం డినుటక్సిమాబ్‌ను ఇపుడు చాలా మంది దిగుమతి చేసుకుంటున్నారు. దీనిపై ఇపుడు విధిస్తున్న దిగుమతి జీఎస్టీని ఎత్తివేస్తారని తెలుస్తోంది. ఈనెల 11వ తేదీన భేటీ అయ్యే జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకునే వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. అలాగే మల్టిప్లెక్స్‌లలో అమ్మే ఆహార పదార్థాలు, ఇతర బేరేజస్‌లపై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. అలాగే యుటిలిటీ వెహికల్స్‌పై ఇపుడు 22 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే యుటిలిటీ వెహికల్‌ అంటే ఏమిటనే దానిపై కూడా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్వచనం ఇవ్వనున్నారు. ప్రైవేట్‌ సంస్థలు శాటిలైట్‌లను ప్రయోగించే సమయంలో వాటి సేవలను జీఎస్టీ నుంచి మినహాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తారు.