For Money

Business News

18500 మార్క్‌ను తాకిన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌లో అప్‌ ట్రెండ్‌ అప్రతిహతంగా కొనసాగుతోంది. మార్కెట్‌ పడినపుడల్లా ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్ట్రలు వరుసగా ఏడు రోజుల నుంచి మార్కెట్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలవడం విశేషం. ఇదే సమయంలో వస్తున్న దేశీయ ఆర్థిక సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండటంతో… సూచీలు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. నిఫ్టి ఇవాళ 19500 మార్కెట్‌ను తాకడం విశేషం. ఒకదశలో 19512ను తాకిన నిఫ్టి 19497 వద్ద ముగిసింది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లకు అద్భుత మద్దతు లభిస్తోంది. అలాగే ఆరంభంలో డల్‌గా ఉన్న బ్యాంకు షేర్లు కూడా పరుగులు పెట్టాయి. దీంతో మొదట్లో నష్టాల్లోకి జారుకుని 19373 పాయింట్లను తాకిన నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌ కావడంతో చివరి నిమిషాల్లో సూచీలు దూసుకుపోయాయి. ఎం అండ్‌ ఎం, అపోలో, పవర్‌ గ్రిడ్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్ షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచ,ఆయి. నిఫ్టి లూజర్స్‌లో ఐషర్‌ మోటార్స్‌ నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. విద్యుత్‌ మీటర్ల భారీ కాంట్రాక్ట్‌ లభించడంతో టాటా మోటార్స్‌ మూడున్నర శాతం లాభంతో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీలో అరవిందో ఫార్మా టాప్‌ గెయినర్‌గా నాలుగు శాతం లాభంతో ముగిసింది.