For Money

Business News

కొనసాగిన బుల్‌ రన్‌

స్టాక్‌ మార్కెట్‌లో నాన్‌ స్టాప్‌ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టి పడినపుడల్లా గట్టి మద్దతు లభిస్తోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్ద ప్రతికూల అంశాలు లేకపోవడంతో నిఫ్టి ఇవాళ మరో 66 పాయింట్లు, సెన్సెక్స్‌ 274 పాయింట్ల లాభంతో ముగిశాయి. నిఫ్టి ఇవాళ 19350పైన 19389 వద్ద ముగియడం విశేషం. ఆరంభంలో లాభాలన్నీ కోల్పోయి 19300 స్థాయిని నిఫ్టికి అదే స్థాయిలో మద్దతు లభించింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ.. మిడ్‌ సెషన్‌ తరవాత ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 19434ని తాకింది. ఇవాళ బజాజ్‌ ఫైనాన్స్‌ స్టార్‌ షేర్‌గా నిలిచింది. ఈ షేర్‌ ఏడు శాతంపైగా లాభపడింది. అలాగే బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ కూడా అయిదున్నర శాతంకన్నా అధిక లాభంతో ముగిసింది. హీరో మోటోకాప్‌ సుమారు అయిదు శాతం లాభపడగా.. టెక్‌ మహీంద్రా రెండున్నర శాతం లాభంతో ముగిసింది. అయితే అమ్మకాలు తగ్గాయన్న వార్తలతో ఐషర్‌ మోటార్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఈ షేర్‌ ఆరు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి షేర్లలో ఇంకా భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసిం, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నెక్ట్స్‌ నష్టాల్లో ముగిసింది. నైకా, ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, వీబీఎల్‌, ఇండస్‌ టవర్‌ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా స్వల్ప నష్టాల్లో ముగిసింది.