For Money

Business News

కోలుకున్నా…నష్టాలు తప్పలేదు

చాలా వారాల తరవాత ఇన్వెస్టర్లకు నిరుత్సాహం కల్గించినవారం ఇది. వారాంతన కూడా నిఫ్టి నష్టాలతో ముగిసింది. కాకపోతే భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిసింది. అల్గో ట్రేడింగ్‌కు అనుగుణం నిఫ్టి వారం రోజుల నుంచి కదలాడుతోంది. ఇవాళ ఉదయం కూడా రెండో ప్రధాన గరిష్ఠ స్థాయి 18,314 పాయింట్ల నుంచి క్షీణించి 18,034 పాయింట్లకు పడింది. అంటే 280 పాయింట్లు పడిందన్నమాట. కాని చివర్లో స్వల్ప మద్దతు లభించడంతో 18,114 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మద్దతు అందడంతో నిఫ్టి నష్టాలు చాలా వరకు తగ్గాయి. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ 0.73 శాతం లాభంతో ముగిసింది. అలాగే మిడ్‌ క్యాప్‌లో కూడా మిడ్‌ సెషన్‌ నుంచే రికవరి వచ్చింది. ఈ సూచీ కూడా 0.59 శాతం నష్టంతో ముగిసింది. అయితే నిఫ్టి తరవాతి ప్రధాన షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టి నెక్ట్స్‌ సూచీ మాత్రం 1.39 శాతం నష్టపోయింది. మంచి ఫలితాలు
చూసిన కంపెనీల షేర్లకు ఇవాళ మంచి మద్దతు లభించింది. మెటల్స్‌ ఇవాళ బాగానే పడ్డాయి.