For Money

Business News

మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ఓపెన్‌

సింగపూర్‌ నిఫ్టి అడుగుజాడల్లో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి తన మద్దతు స్థాయిని టెస్ట్‌ చేసింది. 17936ని తాకిన నిఫ్టి ఇపుడు 98 పాయింట్ల నష్టంతో 17,946 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభిస్తుందేమో చూడాలి. ఒక వేళ స్వల్పంగా పెరిగినా అమ్మకాల ఒత్తిడికి ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. మరి నిఫ్టి ఈలోగానే మద్దతు స్థాయిలో కోల్పోతుందా అన్నది చూడాలి. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ… నిఫ్టి 17950 కీలక స్థాయి అని.. తొందర పడి పొజిషన్స్‌ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లోఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా బలహీనంగా ఉంది. 0.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్‌ నష్టాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది.