For Money

Business News

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

18,500 స్థాయిపైన నిఫ్టి నిలబడలేకపోయింది. అనేక షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 18,500 దిగవనే క్లోజైంది. మిడ్‌ సెషన్‌లో 18,543 పాయింట్లను తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 18,477 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 138 పాయింట్లు అధికంగా అంటే 0.76 శాతం లాభంతో ముగిసింది. అయితే మిడ్ క్యాప్‌ నిఫ్టి సూచీ మాత్రం రికార్డు స్థాయిలో 1.61 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ లాభం మాత్రం 0.25 శాతానికి పరిమితమైంది. ఇక బ్యాంక్‌ నిఫ్టి రికార్డు స్థాయికి చేరి 0.87 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో 28 షేర్లు లాభంతో క్లోజ్‌ కాగా, 22 షేర్లు నష్టంతో ముగిశాయి.