For Money

Business News

డిఫెన్సే దిక్కా?

ఇవాళ కూడా మార్కెట్‌కు అండగా నిలిచిన షేర్లలో డిఫెన్స్‌ షేర్లు ముందున్నాయి. ఫార్మా, రియాల్టి షేర్లకు మద్దతు అందినా… డిఫెన్స్‌ షేర్లే టాక్‌ ఆఫ్‌ ద స్ట్రీట్‌గా నిలిచాయి. నిఫ్టి ఇవాళ 24916 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కాని మిడ్‌ సెషన్‌లో ఏకంగా 24685 స్థాయిని తాకింది. కాస్సేపట్లో నష్టాల్లోకి జారుకునే స్థితిలో ఉండగా మద్దతు అందింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి 24813 పాయింట్లకు చేరుకుని 129 పాయింట్ల లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన షేర్ల సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లలో గట్టి మద్దతు కన్పించింది. ఇవాళ మార్కెట్‌లో 4116 షేర్లు ట్రేడవగా, 2304 షేర్లు లాభాల్లో, 1674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే 203 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో క్లోజ్‌ కాగా, 252 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. ఇక నిఫ్టి 50 టాప్ గెయినర్స్‌గా బీఈఎల్‌, టాటా స్టీల్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ముందున్న నిఫ్టి 50 షేర్లు.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, గ్రాసిమ్, కోల్‌ ఇండియా ఉన్నాయి.