For Money

Business News

అలా పడిపోయిందేమిటి?

25000పైన నిలదొక్కుకున్న నిఫ్టి ఇక 25500ని తాకడమే తరువాయి అనుకున్న క్షణంలో ఇన్వెస్టర్లు ఝలక్ ఇచ్చారు. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా క్షీణించి… క్లోజింగ్‌లో లాభాల్లో ముగిశాయి. చాలా ఫాస్ట్‌గా రివకరీ వచ్చింది. ఇవాళ అదే ఉత్సాహంతో గిఫ్ట్‌ నిఫ్టి వంద పాయింట్ల లాభాల్లో ఉన్నా… ఆరంభంలోనే ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం మొదలు పెట్టారు. చాలా వరకు బ్యాంకుల ఫలితాలు వచ్చేయడంతో బ్యాంక్‌ షేర్లలో చాలా గట్టి ఒత్తిడి వచ్చింది. బ్యాంక్‌ నిఫ్టి, బ్యాంక్‌ ఫైనాన్షియల్స్‌ ఒక శాతంపైగా నష్టపోగా, నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ సుమారు రెండు శాతం పతనమైంది. ఇక నిఫ్టి 281 పాయింట్ల నష్టంతో అంటే ఒక శాతం నష్టంతో 24683 పాయింట్ల వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ కారణంగా ఇవాళ ఐటీ షేర్లలో లాభాలు వచ్చినా… అవి మార్కెట్‌ పతనాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ కూడా 873 పాయింట్ల నష్టంతో ముగిసింది. చాలా కౌంటర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో రియాల్టితో పాటు బ్యాంకు షేర్లు భారీగా పడ్డాయి. అలాగే డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లలో కూడా ఒత్తిడి బాగానే ఉంది. నిఫ్టి 50లో ఇవాళ టాప్‌ గెయినర్స్‌గా కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ నిలిచాయి. ఇక నిఫ్టి 50 టాప్‌ లూజర్స్‌లో ఎటర్నల్‌ (జుమాటొ) బాగా నష్టపోయింది. తరువాతి స్థానాల్లో హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి.