నష్టాలతో ప్రారంభం

స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. గిఫ్ట్ నిఫ్టి 65 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టి మరింత భారీ నష్టంతో ప్రారంభమైంది. ప్రస్ఉతతం 226 పాయింట్ల నష్టంతో 24586 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రాత్రి వాల్‌స్ట్రీట్ భారీ నష్టాలతో ముగియడంతో పాటు దేశీయంగా ఎలాంటి పాజిటివ్ సంకేతాలు లేకపోవడంతో నష్టాలు భారీగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు అధికంగా ఉండటంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. సెన్సెక్స్ 30 సూచీ టాప్ లూజర్స్‌లో టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు ఉన్నాయి. ఇక లాభాల్లో ఉన్న కౌంటర్లలో కేవలం అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే ఉన్నాయి. నిఫ్టిలో టాప్ గెయినర్స్‌గా ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, జియో ఫైనాన్స్‌తో పాటు టాటా స్టీల్ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, నెస్లే ఉన్నాయి.