For Money

Business News

17,600పైన ముగిసిన నిఫ్టి

నిఫ్టి యమ డేంజర్‌గా మారింది. ట్రేడింగ్‌ ఇపుడు పూర్తి పెద్ద ఇన్వెస్టర్ల గేమ్‌గా మారింది. ఇండెక్స్‌ గరిష్ఠ స్థాయిలో ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడి పెట్టలేని స్థితి. ఇపుడు విదేశీ, దేశీయ ఇన్వెస్టర్ల గేమ్‌ మాదిరిగా తయారైంది. పరిస్థితి ఉదయం ఒకదశలో నష్టాల్లోకి జారి 17,510 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత ఎక్కడా ఆగకుండా క్రమంగా పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో ఆరంభమైన యూరో మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. దీంతో మన మార్కెట్‌ ఎక్కడా ఆగలేదు. ముఖ్యంగా వీక్లీ డెరివేటివ్స్‌ ప్రభావం చివర్లో బాగా కన్పించింది. షార్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు భారీగా షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడటంతో చివర్లలో 17,644 పాయింట్లకు నిఫ్టి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల లాభంతో నిఫ్టి 17629 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికాం ప్యాకేజీ కారణంగా ఆ రంగానికి చెందిన షేర్లన్నీ భారీగా పెరిగాయి. జియో యజమాని అయిన రిలయన్స్‌, వొడాఫోన్‌ షేర్లతో పాటు ఈ రంగానికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు గణనీయ లాభాలు గడించాయి. భారతీ ఎయిర్‌టెల్‌ నిన్న, ఇవాళా పెరిగినా లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,131.00 7.31
ఐటీసీ 230.30 6.62 ఎస్‌బీఐ 465.00 4.77
రిలయన్స్‌ 2,424.00 1.92
ఐఓసీ 118.55 1.85

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
గ్రాసిం 1,578.60 -1.76
భారతీ ఎయిర్‌టెల్‌ 715.75 -1.34
టీసీఎస్‌ 3,903.05 -1.30
శ్రీసిమెంట్‌ 30,650.15 -1.26
టాటా స్టీల్‌ 1,436.90 -1.25