For Money

Business News

16,600పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ మార్కెట్‌ భారీ నష్టాల నుంచి బయటపడింది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ బలహీనపడింది. మిడ్‌ సెషన్‌కు ముందు 16564ని తాకింది. అక్కడి నుంచి కోలుకున్నా… చివర్లో మళ్ళీ ఒత్తిడి వచ్చింది. ఎట్టకేలకు కీలక మద్దతు స్థాయి అయిన 16600పైన 16631 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 88 పాయింట్లు క్షీణించింది. ఇతర సూచీల్లో పెద్ద నష్టాల్లేవ్‌. అన్నీ దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి సరిగ్గా నిన్నటి ముగింపు వద్దే ముగిసింది. ఇవాళ నిఫ్టిలో టాటా స్టీల్ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇవాళ మార్కెట్‌ను రిలయన్స్‌ తీవ్రంగా దెబ్బతీసింది. నిఫ్టి లూజర్స్‌లో మహీంద్ర అండ్‌ మహీంద్రా టాప్‌లో ఉండగా, రిలయన్స్‌ తరువాతి స్థానంలో ఉంది. మారుతీ, ఐషర్‌ మోటార్స్‌ కూడా భారీగా నష్టపోయాయి. బోనస్‌ షేర్ల జారీని పరిశీలిస్తామని ప్రకటించడంతో గెయిల్‌ షేర్‌ 4 శాతం పెరిగింది. గత శుక్రవారం భారీ క్షీణించిన ఎస్‌ఆర్‌ఎఫ్‌ ఇవాళ 4 శాతం కోలుకుంది. యూరో మార్కెట్లు ఆరంభంలో నష్టాల్లో ఉన్నా… ఇపుడు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అరశాతంపైగా లాభాల్లో ఉన్నా మన మార్కెట్లు నష్టాల్లో ముగియడానికి ప్రధాన కారణం… గత వారాంతంలో ప్రధాన కంపెనీల నిరుత్సాహకర ఫలితాలు.