For Money

Business News

91 శాతం పెరిగిన నికర లాభం

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ అద్భుత ఫలితాలను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం 91 శాతం పెరిగి రూ.4125 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.2160 కోట్లు. బ్యాంక్ రూ.3400కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (NII) 21 శాతం పెరిగి రూ.9384 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.14 శాతం పెరిగి 3.6 శాతానికి చేరింది. కంపెనీ ఆదాయంలో 34 శాతం అంటే రూ. 3576 కోట్లు ఫీజుల రూపంలో వచ్చిందే. అందులో 66 శాతం ఫీజు ఆదాయం రీటైల్‌ కస్టమర్ల నుంచి వచ్చినదే. ఈ త్రైమాసికంలో 9.9 లక్షల క్రెడిట్ కార్డులను బ్యాంక్‌ జారీ చేసింది.