For Money

Business News

16,200పైన ముగిసిన నిఫ్టి

నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఓపెనింగ్‌లో 16275ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత 16157ని తాకింది. కాని క్లోజింగ్‌కల్లా 16220 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టటి 88 పాయింట్లు లాభపడింది. మధ్యలో చాలా సార్లు ఒడుదుడుకులకు లోనైంది. ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ముగిసినా… నిఫ్టి బ్యాంక్‌ మాత్రమే అరశాతంపై లాభంతో ముగిసింది. ఇతర సూచీలు నామమాత్ర లాభాలతో ముగిశాయి. పైగా మధ్యలో ఒక మోస్తరు నష్టాలు కూడా పొందాయి. అన్నీ క్లోజింగ్‌ సమయానికి గ్రీన్‌లో వచ్చాయి. నిఫ్టి నెక్ట్స్‌ 0.29 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.13 శాతం లాభంతో ముగిసింది. సూచీ ప్రధాన షేర్లు మినహా.. మిగిలిన షేర్లలో పెద్ద మార్పు లేదు. మిడ్‌ సెషన్‌లో ఆరంభమైన యూరో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. తరవాత లాభాల్లోకి వచ్చాయి. ఇపుడు అర శాతం పైగా లాభంతో ఉన్నాయి. టాప్‌ గెయినర్స్‌, లూజర్స్‌లో మార్పులు చేర్పులు జోరుగా ఉన్నాయి. చివరికి ఎల్‌ అండ్‌ టీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మారుతీ ఒకటన్నిర శాతం నష్టంతో ముగిసింది.నిఫ్టి నెక్ట్స్‌ ఓపెనింగ్, క్లోజింగ్‌ ముందు మినహా.. మిగిలిన సమయమంతా రెడ్‌లో సాగింది.