For Money

Business News

భారీ లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

ఫెడ్‌ వడ్డీ నిర్ణయాలను మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోంది. ప్రైస్‌ రివిజన్‌ కీలక దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌లు పరుగులు తీస్తున్నాయి. నిన్న ఉదయం ఆసియా, మధ్యాహ్నం యూరో, రాత్రి అమెరికా…అన్ని మార్కెట్లు భారీ లాభాలతో ముగివాయి. రాత్రి నాస్‌డాక్‌ 1.4 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, డౌజోన్స్‌ అరశాతం లాభంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు 1.5 శాతం పైగా లాభంతో ఉన్నాయి. షాంఘై సూచీ కూడా ఒక శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి కూడా 140 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18200కు తాకే అవకాశాలు ఉన్నాయి.