For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. 17310 వద్ద ప్రారంభమైనా..వెంటనే 17273కి చేరింది. ప్రస్తుతం ఇదే స్థాయి వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 66 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నా నష్టాలు భయపడినట్లుగా లేవు. ఇక నిఫ్టిలో ఐటీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. రెండు శాతం లాభంతో ఐటీసీ రూ. 313 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలోని ఇతర షేర్ల లాభాలు ఒక శాతం కన్నాతక్కువగా ఉన్నాయి. ఇక యూపీఎల్‌ 4 శాతం పైగా నష్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. హిందాల్కో మూడు శాతం, టాటా స్టీల్‌ 2.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఫలితాలు బాగుండటంతో జొమాటొ 7 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.