For Money

Business News

ఆటో డెబిట్‌ పేమెంట్స్‌.. కొత్త రూల్స్‌ రేపటి నుంచి

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌ స్స్ర్కిప్షన్‌, మొబైల్‌ బిల్‌ పేమెంట్స్‌, ఇన్సురెన్స్‌ ప్రీమియమ్‌, కరెంటు బిల్లు వంటి యుటిలిటీ బిల్స్‌… ఇతరత్రా నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్‌ పేమెంట్‌ ఇవాళ్టి నుంచి ఆగిపోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఇలాంటి చెల్లింపుల కోసం మీ సేవింగ్స్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ లేదా క్రెడిట్ కార్డుకు లింక్‌ చేసేవారు. ప్రతినెలా మీ ప్రమేయం లేకుండా ఈ బిల్లులు ఆటోమేటిగ్‌గా చెల్లింపు అయ్యేవి. అయితే ఆ పద్ధతి ఇవాళ్టి నుంచి ఆగిపోనుంది.
రేపటి నుంచి…
రేపటి నుంచి నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్‌ సంస్థలుగానీ ఆటోమేటిక్‌ పేమెంట్స్‌ కోసం కస్టమర్ల నుంచి ‘అడిషనల్‌ ఫాక్టర్‌ అథెంటిఫికేషన్‌ (AFA)’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అంటే చెల్లింపు చేసే ముందు కస్టమర్ల నుంచి ప్రతిసారీ అంగీకారం పొందాల్సి ఉంటుంది. ఇది కూడా రూ. 5000లోపు బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే కరెక్టుగా చెల్లింపు తేదీన.. సదరు మొత్తం చెల్లించే ముందుకు మీకు మెసేజ్‌ వస్తుంది. మీరు ఓకే అంటేనే చెల్లింపు జరుగుతుంది. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. ఇలా ప్రతి చెల్లింపులోనూ ఈ తతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రూ. 5,000 మించిన లావాదేవీకి ఈ మాండేట్‌ (e mandate) పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఎంత వరకు అమల్లో ఉండాలో కూడా చెప్పాల్సి ఉంటుంది. పైగా లావాదేవీ జరిగే ముందుకు 24 గంటలు ముందుగా కస్టమర్‌కు తెలపాల్సి ఉంటుంది. అపుడు అవసరమైతే కస్టమర్‌ సదరు లావాదేవీ ధృవీకరించకుండా ఉండొచ్చు.
వీటికి వర్తించదు…
బ్యాంకు ఈఎంఐలు, మ్యూచువల్‌ ఫండ్‌లకు చెల్లింపులతో పాటు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ (ఎస్‌ఐపీ)లకు ఇది వర్తించదు. బ్యాంకు అకౌంట్‌ ద్వారా చెల్లించడానికి ముందే ఒప్పందం చేసుకుంటారు కాబట్టి.. వీటి చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫలానా సర్వీసు వొద్దని కస్టమర్లు వెళ్ళిపోయినా సరే.. థర్డ్‌ పార్టీ కంపెనీలు కస్టమర్ల ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే డేటా ప్రైవసీ, సెక్యూరిటీ కారణంగా కొత్త రూల్స్‌ తెచ్చాయి. కస్టమర్‌ మొత్తం ఆర్థిక లావాదేవీలను థర్డ్‌ పార్టీ కంపెనీలు నిక్షిప్తం చేసుకుంటున్నాయి. ఈ బెడద నుంచి కస్టమర్లను కాపాడేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.