For Money

Business News

భారీ లాభాల్లో నాస్‌డాక్‌

మరికొన్ని గంటల్లో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుంది. 0.75 శాతం మేర వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచుతుందని దాదాపు 99 శాతం మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక శాతం మేర పెంచే అవకాశముందని మరికొందరు అంటున్నారు. చూస్తుంటే 0.75 శాతం వడ్డీని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోంది. అదే జరిగితే ఫెడ్‌ కామెంటరీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో నాస్‌డాక్‌ 2.4 శాతం లాభంతో ట్రేడవుతోంది.అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.3 శాతం లాభంతో ఉండగా, డౌజోన్స్‌ మాత్రం 0.33 శాతానికి పరిమితమైంది. డాలర్‌ ఇవాళ మరింత బలపడింది. అలాగే అమెరికాలో వారాంతపు క్రూడ్‌ నిల్వలు తగ్గాయి. దీంతో క్రూడ్‌ ధరలు భగ్గుమన్నాయి. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు యూరప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ ఏడు వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ఫెడ్‌ ఒకవేళ 0.5 శాతం మేర వడ్డీ తగ్గిస్తే .. మార్కెట్‌లో గట్టి ర్యాలీకి ఛాన్స్‌ ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.