For Money

Business News

అమెరికా మార్కెట్ల జోరు

కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగుండటంతో మార్కెట్‌ పాజిటివ్‌గా స్పందిస్తోంది. వాల్‌స్ట్రీట్‌లోని మూడు ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ రెండు శాతం పైగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. అలాగే డౌజోన్స్‌ కూడా ఒక శాతంపైగా లాభంతో ఉంది. డాలర్‌ స్వల్పంగా పెరగ్గా, పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ కూడా ఒక శాతం వరకు పెరిగాయి. అయితే అన్ని రకాల వస్తువులు, లోహాల ధరలు తగ్గాయి. క్రూడ్‌ ఆయిల్‌ మరో మూడు శాతం తగ్గడంతో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 97.36 డాలర్లకు వచ్చింది. అలాగే బంగారం, వెండి ధరలు కూడా ఒక శాతం వరకు తగ్గాయి.