For Money

Business News

US: మార్కెట్లలో ర్యాలీ

వాల్‌స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ సూచీలు బాలపడ్డాయి. ఆరంభంలో కాస్త బలహీనంగా ఉన్నా ఇపుడు నాస్‌డాక్‌ 1.36 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇక డౌజోన్స్‌ 0.56 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన డాలర్ ఇపుడు చల్లబడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 106 దిగువకు వచ్చేసింది. అలాగే 10 ఏళ్ళ అమెరికా బాండ్లపై ఈల్డ్స్‌ కూడా తగ్గి 2.63 శాతానికి పరిమితమైంది. డాలర్‌ బలహీనపడటం, నిన్న అమెరికాలో క్రూడ్‌ నిల్వలు తగ్గినట్లు డేటా రావడంతో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ కూడా రెండు శాతంపైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 104 డాలర్లకు చేరింది. మరో వైపు బులియన్‌ కూడా ఇవాళ కాస్త బలపడింది. వెండి రెండు శాతం దాకా లాభపడగా, బంగారం అరశాతం కన్నా అధిక లాభాల్లో ఉంది. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి.