For Money

Business News

IOC నష్టం రూ.1,992 కోట్లు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,992 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్థిరంగా ఉంచడంతో మార్జిన్లు భారీగా క్షీణించినట్లు కంపెనీ వెల్లడిచింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో కంపెనీ రూ.5941.37 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా.. ప్రస్తుత ఏడాది మాత్రం రూ.1992.53 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే ఆదాయం మాత్రం రూ.1.55 లక్షల కోట్ల నుంచి 2.51 లక్షల కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. బ్యారెల్‌ ముడి చమురు దిగుమతి ధర సగటున 109 డాలర్లు కాగా, 85-86 డాలర్ల సగటు ధర వద్ద రిటైల్‌గా పెట్రోల్‌, డీజిల్‌ అమ్ముతున్నట్లు కంపెనీ పేర్కొంది.