For Money

Business News

టెక్‌, ఐటీ షేర్లు ఢమాల్‌

వడ్డీ రేట్ల భయం స్టాక్‌ మార్కెట్లను వెంటాడుతోంది. పదేళ్ళ అమెరికా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌ రెండేళ్ళ గరిష్ఠానికి చేరాయి. దీంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 96కి దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో టెక్‌, ఐటీ షేర్ల సూచీ నాస్‌డాక్‌ 2.5 శాతం నష్టంతో ప్రారంభమైంది. అలాగే ఇతర సూచీలు కూడా. ప్రస్తుతం నాస్‌డాక్‌ 2 శాతం, డౌజోన్స్ 1.2 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మూడుకు బదులు నాలుగుసార్లు వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే జులైకల్లా ఫెడ్‌ బ్యాలెన్స్‌ను తగ్గించనున్నారు. ఈ ఏడాది అమెరికా ట్రజరీ బాండ్‌ ఈల్డ్స్‌ కనీసం 0.5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో షేర్‌ మార్కెట్‌లో మరింత పతనం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.