For Money

Business News

పాపం అదానీ… పడిపోయాడు

ఆసియా నంబర్‌ వన్‌ కోటీశ్వరుడిగా ఉన్న గౌతమ్‌ అదానీని నిన్నటి షేర్‌ మార్కెట్‌ పతనం కిందికి పడేసింది. మళ్ళీ రిలయన్స్‌ ముకేష్‌ అంబానీ నంబర్‌ స్థానానికి వచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం తక్కువ ఉండటంతో నంబర్‌ వన్‌ స్థానం మ్యూజికల్‌ ఛైర్‌గా మారింది. నిన్న స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల పతనంతో అదానీ సంపద 379 కోట్ల డాలర్ల క్షీణించింది. ముకేష్‌ అంబానీ సంపద మాత్రం 148 కోట్ల డాలర్లు మాత్రమే పడింది. దీంతో ముకేష్‌ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితా టాప్‌టెన్‌లో చేరారు. తాజా సంపద ప్రకారం 8750 కోట్ల డాలర్లతో ముకేష్‌ ఆసియాలో నంబర్‌ వన్ స్థానంలో ఉండగా, తరవాతి స్థానంలో ఉన్న అదానీ సంపద 8280 కోట్ల డాలర్లకు చేరింది.