For Money

Business News

స్మాల్‌ క్యాప్‌లో ఇంకా సీన్‌ ఉంది

బ్లూచిప్‌ కంపెనీలు, సూచీలు ఇక ఆకర్షణీయ ఫలితాలు ఇవ్వలేవనని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ శంకర్‌
శర్మ అన్నారు. ఆయన ఇవాళ సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ ఏడాది నుంచి నిఫ్టిలో పెద్దగా మార్పు లేదు. గత ఏడాది ఆగస్టు స్థాయిలో ఉందని అన్నారు. అలాగే బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా కాంపౌండింగ్ వృద్ధి సాధించలేవని ఆయన అన్నారు. మార్కెట్‌ బలహీనంగా ఉందని పెద్ద షేర్లు చెబుతున్నాయని అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. వచ్చే నెల మార్కెట్‌లో ప్రవేశించనున్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్‌తో మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గిపోతుందన్న వాదనలను ఆయన ఖండించారు. అయితే రీటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా ఎల్‌ఐసీ ఇష్యూకు దరఖాస్తు చేస్తారా అన్నది చూడాలని అన్నారు. ఇటీవల అనేక న్యూ ఏజ్‌ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని అన్నారు. వీరు అంతే ఉత్సాహంగా ఎల్‌ఐసీకి దరఖాస్తు చేస్తారా అన్నది చూడాలని అన్నారు. ఇపుడు యాక్షన్‌ మొత్తం స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ఉందని అన్నారు. ముఖ్యంగా కెమికల్స్‌, మెటల్స్‌ రంగాల షేర్లకు భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఈరంగాల నుంచి మంచి షేర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉందని అన్నారు.