For Money

Business News

భారత్‌ రేటింగ్ పెంచిన మూడీస్‌

భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని అంతర్జాతీయ రేటింగ్స్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. మున్ముందు మంచి రోజులు ఉంటాయనే అంచనాతో భారత్‌ ఔట్‌లుక్‌ రేటింగ్‌ను పెంచింది. ప్రస్తుత రేటింగ్‌ను మాత్రం మార్చలేదు. ఇపుడు భారత్‌కు BAA3 రేటింగ్‌ ఉంది. దీన్ని ఇలాగే ఉంచి ఔట్‌లుక్‌ రేటింగ్‌ను పెంచుతున్నట్లు మూడీస్‌ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌ అవుట్‌లుక్‌ నెగిటివ్‌గా ఉంది. దీన్ని స్టేబుల్‌ కు పెంచుతున్నట్లు మూడీస్‌ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ, లిక్విడ్ రిస్క్‌ తగ్గుతున్నట్లుగా మూడీస్‌ పేర్కంది. భారత్‌ జారీచేసే విదేశీ కరెన్సీ, దేశీయ కరెన్సీ దీర్ఘకాలిక బాండ్లకు బీఏఏ3 రేటింగ్‌నే కొనసాగిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ తెలిపింది. బీఏఏ3 రేటింగ్‌ జంక్‌ స్టేటస్‌కంటే ఒక లెవెల్‌ ఎక్కువ.