For Money

Business News

జగన్‌ను మించిన మోడీ

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే భారత దేశం కూడా రుణ ఊబిలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది. సొంత వనరులకు రుణాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదికి రూ. 45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద రూ. 45 లక్షల కోట్లను ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. అయితే కేంద్రం పరోక్ష, ప్రత్యక్ష పన్నుల రూపేణ రూ. 26 లక్షల కోట్లను మాత్రమే సమకూర్చకోనుంది. మిగిలిన దాదాపు రూ. రూ. 18 లక్షల కోట్లను రుణాల ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రుణాల మొత్తం రూ. 114 లక్షల కోట్లకు చేరింది. దీంతో వడ్డీల భారం భారీగా పెరిగింది. వచ్చే బడ్జెట్‌లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 20 పైసలు కేవలం వడ్డీ చెల్లింపులకే చేయాల్సి ఉంటుంది. అదే గత బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం రూ. 2.08 లక్షల కోట్లు ఖర్చు చేయగా, వడ్డీ చెల్లింపుల కోసం రూ. 21,000 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన మోడీ కన్నా జగన్‌ నయంలా కన్పిస్తోంది కదూ!