For Money

Business News

మైండ్‌ట్రీ లాభం రూ. 473 కోట్లు

మార్చితో ముగిసిన త్రైమాసికంలో మైండ్‌ట్రీ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.473.10 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.317.30 కోట్ల లాభంతో పోలిస్తే 49.10 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 37.4 శాతం పెరిగి రూ.2,897.40 కోట్లకు చేరింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.10,525.30 కోట్ల ఆదాయంపై రూ.1,652.90 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పరిశ్రమలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డిజిటల్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో గతేడాది రికార్డు స్థాయి లాభాలను ఆర్జించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేబాషిస్‌ చటర్జీ తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.27 లేదా 270 శాతం తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.