For Money

Business News

అమరాన్‌ బ్యాటరీ మస్కట్‌ ‘రాన్‌’

ఆటోమోటివ్‌ బ్యాటరీస్‌ కంపెనీ అమరాన్‌ తమ మస్కట్‌ ‘ద రాన్‌’ను విడుదల చేసింది. కొత్త అమరాన్‌ బ్యాటరీలను ప్రవేశపెట్టిన సందర్భం గా ఈ మస్కట్‌ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. తిరుపతి జిల్లా కరకంబాడి పరిశ్రమలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ సీఎండీ గల్లా జయదేవ్‌ ఈ బ్రాండ్‌ మస్కట్‌ను విడుదల చేశారు. బ్యాటరీ పవర్‌ను బట్టి వివిధ రాన్‌లు ఉంటాయి. బ్రాండ్‌ మస్కట్‌ను విడుద ల చేయాలని భావించామని, అందుకు తగిన సమయం కోసం ఎదురు చూశామని జయదేవ్‌ గల్లా అన్నారు.