For Money

Business News

మా రుణాలు బాగా తగ్గాయి

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణ శాతం బాగా తగ్గిందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలు రుణ ఊబిలో కూరుకుపోతున్నాయంటూ క్రెడిట్‌ సైట్స్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందిస్తూ అదానీ గ్రూప్‌ 15 పేజీల నోట్‌ను మీడియాకు విడుదల చేసింది. గత 9 ఏళ్ళలో కంపెనీ ఎబిటా (EBITDA)కు నికర రుణ నిష్పత్తి 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గిందని అదానీ గ్రూప్‌ వివరించింది.2022 మార్చి నెలాఖరుకు తమ గ్రూప్‌ స్థూల రుణం రూ. 1.88 లక్షల కోట్లని, నికర రుణం రూ. 1.61 లక్షల కోట్లని పేర్కొంది. 2015-16లో తమ రుణంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణం 55 శాతం ఉండేదని.. ఇపుడు అది 21 శాతానికి తగ్గిందని వెల్లడించింది. అలాగే ప్రైవేట్‌ బ్యాంకుల రుణ శాతం కూడా 31 శాతం నుంచి 11 శాతానికి క్షీణించిందని పేర్కొంది. మూలధన మేనేజ్‌మెంట్‌ వ్యూహంలో భాగంగా రుణ పరిస్థితి బాగా మెరుగు పర్చుకున్నామని పేర్కొంది.