For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

ప్రపంచ మార్కెట్లు పాజిటవ్‌గా ఉన్న మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఒకదశలో 17,764ను తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కు ముందు 17587ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని గ్రీన్‌లోకి వచ్చినా… క్లోజింగ్‌ సమయానికల్లా 17655 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 10 పాయింట్లు నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు క్షీణించింది. నిఫ్టిలో 20 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా 29 షేర్లు నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా ఆకర్షణీయ లాభాలు గడించిన నిఫ్టి బ్యాంక్‌ నష్టాలతో ముగిసింది. అయితే నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం 0.65 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిని ఇవాళ అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ షేర్లు కాపాడాయి. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో అంబుజా సిమెంట్‌ 5.5 శాతం లాభపడగా, టాటా పవర్, పీఎన్‌బీ షేర్లు నాలుగు శాతం పైగా లాభంతో ముగిశాయి. అదానీ ఎంటర్‌టైన్మెంట్‌, ఏసీసీ షేర్లు కూడా రెండున్నర శాతం లాభపడ్డాయి. నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ ఫైవ్‌లో మూడు షేర్లు అదానీ గ్రూప్‌ షేర్లు కావడం విశేషం. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌ అయిదు శాతం దాకా లాభపడింది. యూరప్‌ మార్కెట్లు ఒక శాతం దాకా లాభపడగా, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టిపై ఎపుడు ఏమాత్రం ఒత్తిడి వచ్చినా.. వెంటనే కొనుగోలు మద్దతు అందుతోంది.