For Money

Business News

ఇంటి రుణాల పరిమితి పెంపు

ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు పెరగనుండటంతో… ఈ రుణాలకు డిమాండ్‌ తగ్గనుంది. దీన్ని కాస్త రివర్స్‌ చేసే వ్యూహంలో భాగంగా సహకార బ్యాంకులు ఇచ్చే ఇంటి రుణాల పరమితిని పెంచింది. టైర్‌ 1/టైర్‌2 పట్టణాల్లో ఉన్న అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులు ఇప్పటి వరకు రూ 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఇంటి రుణం ఇస్తున్నాయి. ఈ పరిమితిని రూ. 60 లక్షల నుంచి రూ. కోటి 40 లక్షల వరకు ఆర్బీఐ పెంచింది. అలాగే రూ. 100 కోట్ల లోపు నెట్‌వర్త్‌ ఉన్న గ్రామీణ సహకార బ్యాంకులు ఇపుడు ఇస్తున్న రుణ పరిమితి రూ. 20 లక్షలు కాగా దీన్ని రూ. 50 లక్షలకు పెంచింది. మిగిలిన గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షలకు పెంచింది.రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌, రెసిడెన్షియల్‌ హౌసింగ్‌లకు రుణాలకు ఇవ్వొచ్చని ఆర్బీఐ పేర్కొంది.