For Money

Business News

వడ్డీ రేట్ల పెంపు… స్థిరంగా నిఫ్టి

రెపో రేటును ఆర్బీఐ అర శాతం పెంచిన తరవాత మార్కెట్‌ స్వల్పంగా లాభడింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,514ని తాకింది. ఆ తరవాత నష్టాల్లోకి జారుకుంది. గరిష్ఠ స్థాయి నుంచి 125 పాయింట్లకు పైగా క్షీణించింది. ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో 16386 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరగడంతో అమెరికా ఈక్వీటీ ఫ్యూచర్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్‌లో ఇతర ప్రధాన సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. భారీ లాభనష్టాలు లేవు. నిఫ్టిలో 26 షేర్లు లాభాల్లో … 24 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరి నిఫ్టి ఎలా ముగుస్తుందో చూడాలి.