For Money

Business News

డే ట్రేడింగ్‌…ఈ మూడు షేర్లు కొనండి

క్రెడిట్‌ పాలసీ వెల్లడి తరవాత నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. క్రెడిట్‌ పాలసీ కూడా వచ్చేసిందని… ఇక నిఫ్టి 17000 వైపు పరుగులు తీయడమే ఆలస్యమని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అంటున్నారు. క్రెడిట్‌ పాలసీ తరవాత బ్యాంకులు, మెటల్స్‌ భారీగా పెరుగుతున్నాయని అన్నారు. రిలయన్స్‌ నష్టాల్లో ఉందని… లేకుంటే నిఫ్టి గ్రీన్‌లో ఉండేదని ఆయన అన్నారు. మూడు షేర్లను ఫ్యూచర్స్‌లో కొనుగోలు చేయాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు. సెయిల్‌ షేర్‌ను ఇపుడు రూ. 76.25 వద్ద ఉంది. రూ. 73 స్టాప్‌లాస్‌తో రూ. 78.50 లేదా రూ.79 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. ఇక రెండో షేర్‌ నాల్కో. ఈ షేర్ ఇపుడు రూ. 93.85 వద్ద ఉంది. రూ. 90 స్టాప్‌లాస్‌తో రూ. 100 లేద రూ. 101 టార్గెట్‌తో కొనాలన్నారు. ఇక మూడో షేర్‌ హెచ్‌ఏఎల్‌. ఈ షేర్‌ ఇపుడు రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. రూ. 1810 స్టాప్‌లాస్‌తో రూ. 1950 లేదా రూ. 1975 టార్గెట్‌తో కొనుగోలు చేయాలన్నారు. ఇవన్నీ ఫ్యూచర్స్‌ రేట్లు.