For Money

Business News

16400 దిగువన ముగింపు

ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ పెద్దగా పట్టించుకోలేదు. క్రెడిట్‌ పాలసీ తరవాత 16514 పాయింట్లకు పెరిగిన నిఫ్టి… తరవాత యూరో మార్కెట్లకు అనుగుణంగా స్పందించింది. యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి కూడా స్వల్ప నష్టాలతో అంటే 60 పాయింట్ల నష్టంతో 16356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 16400 దిగువన క్లోజ్‌ కావడంతో టెక్నికల్‌గా కాస్త వీక్‌గా మారిందని చెప్పాలి. ఇతర సూచీల్లోనూ పెద్దగా మార్పులు లేవు. క్రెడిట్‌ పాలసీ తరవాత కొన్ని బ్యాంక్‌ షేర్లు పెరిగినా… క్లోజింగ్‌ కల్లా అవిపోయాయి. అలాగే కన్జూమర్‌ రంగానికి షేర్లలో ఒత్తిడి బాగా కన్పించింది. ఐటీసీ, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి షేర్లు దాదాపు రెండు శాతం నష్టంతో ముగిశాయి. మెటల్స్‌ పరవాలేదు. ఎస్‌బీఐ కూడా. నిఫ్టిలో మొత్తం 28 షేర్లు నష్టాలతో క్లోజ్ కాగా, 22 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎల్ఐసీ పతనం జెట్ స్పీడుతో కొనసాగుతోంది. ఇవాళ మరో రూ. 15 క్షీణించి రూ. 738 వద్ద ముగిసింది.