For Money

Business News

హౌసింగ్‌ లోన్‌: వడ్డీ మరింత తగ్గింపు

పండుగ సీజన్‌ వచ్చేసింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. కంపెనీలు రుణాలు తీసుకోవడం లేదు. దీంతో రీటైల్‌ రుణాలకే బ్యాంకులకు దిక్కుగా మారింది. పండుగ సీజన్‌ సందర్భంగా ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గించినట్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. దీంతో వడ్డీ రేటు 6.5 శాతానికి తగ్గింది. పండుగ సీజన్‌ సందర్భంగా ఈ ఆఫర్‌ ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్‌ 8వ తేదీ వరకు ఇస్తున్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. గడచిన దశాబ్దంలో ఎన్నడూ లేని తక్కువ వడ్డీ రేట్లు ఇపుడు మార్కెట్‌లో ఉన్నాయి. ఇతర బ్యాంకులు పోటీ పడి తగ్గిస్తాయేమో చూడాలి.