For Money

Business News

నిఫ్టికి ఐటీ జోష్‌

ఊహించినట్లు ఐటీ కంపెనీల జోరుతో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,293 పాయింట్ల స్థాయిని తాకింది. ప్రధాన ఐటీ కౌంటర్లన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో అసలు ర్యాలీ కన్పిస్తోంది. మైండ్‌ట్రీ ఏకంగా 9 శాతం పెరిగింది. టాటా మోటార్స్‌ ర్యాలీ ఆగడం లేదు. క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 18,258 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ జోరుగా ఉంది. ఈ సూచీ 1.3 శాతం పెరిగింది. నిఫ్టిలో ఏకంగా 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కంపెనీల ఫండమెంటల్స్‌ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సింపుల్‌ గాంబ్లింగ్‌. లిక్విడిటీ ఉంది కాబట్టి… ప్రతి చిన్న వార్తకూ షేర్లు స్పందిస్తున్నాయి. నిఫ్టి 18,300 దాటితే లాభాల స్వీకరణ జోరుగా ఉండే అవకాశముంది. నిఫ్టికి తదుపరి ప్రతిఘటన 18,330. ఈ ప్రాంతానికి వస్తే నిఫ్టి అమ్మడానికి బెస్ట్‌ ఛాన్స్‌. ఇది కేవలం డే ట్రేడర్స్‌కు మాత్రమే. పొజిషనల్‌ ట్రేడర్స్‌ పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. రిస్క్‌ తీసుకునేవారు తమ పొజిషన్స్‌ను కంటిన్యూ చేయొచ్చు.