For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపు… ఉపసంహరణ

కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఒకదశలో బ్యారెల్‌ ముడి చమురు ధర 120 డాలర్లను దాటింది. రష్యా నుంచి 30 శాతంపైగా డిస్కౌంట్‌తో ముడి చమురు కొనుగోలు చేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. అక్కడి నుంచి ముడి చమురు ధరలు 90 డాలర్లకు తగ్గినా ఈ కంపెనీలు ధరలు తగ్గించడం లేదు. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకుంటున్నట్లు తెలిపాయి. ఒకవైపు ధరలు పెరిగి జనం తంటాలు పడుతున్నా… ప్రభుత్వం ఏమాత్రం పన్నులు తగ్గించడం లేదు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కూడా తమ లాభాలను వొదలడం లేదు. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాత్రి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ధరలను తగ్గించి.. ఆ మేరకు డీలర్లకు సమాచారం ఇచ్చింది. నిన్న రాత్రి ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు 40పైసలు చొప్పున తగ్గించినట్లు సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్ పేర్కొంది. అయితే అర్ధరాత్రి తమ నిర్ణయం మార్చుకుని… తమ వెబ్‌సైట్లో మళ్ళీ పాత రేట్లను ఉంచినట్లు ఆ ఛానల్ ప్రతినిధి తెలిపారు. పెట్రోల్‌, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించే అవకాశముందని తెలుస్తోంది. 40పైసలు చొప్పున తగ్గించవచ్చు. ఈ వారంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించనున్నాయి. మరోవైపు విమానాలు వాడే పెట్రోల్‌ ధరను కిలో లీటర్‌ ధరను 4.3 శాతం పెంచారు. దీంతో కిలో లీటర్‌ ధర రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.2 లక్షలకు చేరింది.