For Money

Business News

సెంట్రల్‌ బ్యాంక్‌, ఐఓబీ ప్రైవేటీకరణ?

ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్‌ రంగానికి చెందిన పలు చట్టాలను కేంద్రం సవరించనుంది. పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ మేరకు బిల్లులు రెడీ చేసింది. గత బడ్జెట్‌ సమావేశాల్లోనే రెండు పీఎస్‌యూ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రైవేటీకరించే ఆ రెండు బ్యాంకులు ఏవి అన్న సస్పెన్స్‌ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు మాత్రం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులను ప్రైవేటీకరిస్తారని భావిస్తోంది. అందుకే ఇవాళ ఈ రెండు బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 11 శాతం దాకా పెరగ్గా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ 14 శాతం దాకా పెరిగింది. అయితే ప్రైవేటీకరణకు సంబంధించిన తమకు ఎలాంటి సమాచారం లేదని ఆ రెండు బ్యాంకులు అంటున్నాయి.