For Money

Business News

మొన్న వాట్సప్‌… నేడు ఇన్‌స్టా డౌన్‌

గంట నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది తమ ​అకౌంట్​లు లాక్​ అయిపోయినట్టు మెసేజ్‌లు వస్తున్నాయని కొందరు … తమ అకౌంట్లు సస్పెండ్‌ అయినట్లు తమకు నోటిఫికేషన్లు వస్తున్నాయని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అకౌంట్​లు సస్పెండ్​ అయినట్టు సమాచారం. సస్పెండ్​ అయిన అకౌంట్​ను పునరుద్ధరించేందుకు ఈమెయిల్​, ఫోన్​ నెంబర్​ వంటి వివరాలను యాప్​ అడుగుతున్నట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన ఇన్​స్టాగ్రామ్​.. ఇన్​స్టాగ్రామ్​ యాక్సెస్​ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలిసిందని… సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్వీట్​ చేసింది.