ధరల దెబ్బకు షేర్లు మటాష్
ఇప్పటికే బక్క చిక్కిపోయిన నాస్డాక్ ఇవాళ ఓపెనింగ్‌లోనే మూడు శాతంపైగా పడింది. ఐటీ, టెక్ షేర్లను జనం వేలం వెర్రిగా అమ్మేశారు. ద్రవ్యోల్బణ రేటు సెప్టెంబర్ నెలలో కూడా అంచనాలకు మించి పెరగడంతో… ఫెడరల్ రిజర్వ్ మరింత స్పీడుగా, ఎక్కువగా వడ్డీ రేట్లను పెంచనుంది. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా పదేళ్ళ బాండ్‌పై ఈల్డ్‌లు నాలుగు శాతం దాటాయి. డాలర్లో పెద్ద మార్పు లేకున్నా… ఈల్ట్స్ చావుదెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు షేర్లను అమ్మి.. బాండ్లవైపు పరుగులు తీస్తున్నారు. భారీ అమ్మకాల నుంచి తేరుకున్న నాస్డాక్ ఇపుడు 2 శాతం నష్టంతో, ఎస్ అండ్ పీ 500 సూచీ ఒకటిన్నర శాతం, డౌజోన్స్ ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్ బలంగానే ఉండటం, అమెరికా మార్కెట్లలో డిమాండ్ కొనసాగుతోందనే వార్తలతో క్రూడ్ ఆయిల్ స్థిరంగా ఉంది. మరి మార్కెట్ ఇదే స్థాయిలో ఉంటుందా? లేదా క్లోజింగ్‌లో మరింత అమ్మకాల ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి. ఇవాళ ఉదయం ఈక్విటీ మార్కెట్ రివ్యూ సమయంలో మనదేశంలో అనలిస్టులు ఓ హెచ్చరిక చేశారు. ఇవాళ్టి పొజిషన్స్ ఇవాళే క్లోజ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. రేపు మార్కెట్ 200 పాయింట్లు ప్లస్ లేదా మైనస్‌లో ప్రారంభం కావొచ్చని. రేపు నష్టాలతో మన మార్కెట్ ప్రారంభం కానుంది.