For Money

Business News

పామోలిన్‌ ధరలు భారీగా పెంపు

ఇండోనేషియా ప్రభుత్వం పామోలిన్‌ ఎగుమతులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఒకస్థాయి వరకు లెవీ విధించి పామోలిన్‌ ఎగుమతులను అనుమతించేది. ఎగుమతి పరిమాణంపై ఆంక్షలు ఉండేవి. అయినా దేశీయంగా పామోలిన్‌ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ధరల కట్టడి విఫలయత్నం చేసిన ఇండోనేషియా ఇపుడు కొత్త పద్ధతి తీసుకు వచ్చింది. దీని ప్రకారం పామోలిన్‌ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే పామోలిన్‌ కనీస ధరను (రెఫరెన్స్‌ రేటు) దాటి ఎగుమతులు పెరిగే కొద్దీ లెవీ పెంచేలా కొత్త నిబంధనను అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రెఫరెన్స్‌ రేటు 50 డాలర్లు పెరిగితే 20 డాలర్లు లెవీ పెరిగే నిబంధన తెచ్చింది. గరిష్ఠంగా టన్నుకు 350 డాలర్ల లెవీ విధించనున్నట్లు పేర్కొంది. దీంతో మొన్నటి దాకా టన్నుకు 1050 డాలర్లు ఉన్న రెఫరెన్స్‌ రేటు ఇపుడు 1432 డాలర్లకు చేరింది. ఇలా లెవీ ద్వారా వచ్చిన సొమ్మును దేశ ప్రజలకు సబ్సిడీ రూపంలో ఇస్తానని ఇండోనేషియా అంటోంది. అయితే భారత్‌ వంటి దేశాలు పామోలిన్‌ దిగుమతికి భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నమాట.