For Money

Business News

ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి

స్టాక్‌మార్కెట్‌లోఅమ్మకాల ఒత్తిడి ప్రభావం రూపాయి మారకం విలువపై పడుతోంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడింది. నిన్ననే రూపాయి విలువ 77.81కి పడిపోయినా… చివర్లో స్టాక్‌ మార్కెట్‌ కోలుకోవడంతో రూపాయి కూడా కోలుకుని 77.74 వద్ద ముగిసింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే స్పాట్‌ మార్కెట్‌లో 77.82ను తాకింది. ఫార్వర్డ్‌ మార్కెట్‌లో జూన్‌కాంట్రాక్ట్‌ ఇపుడు 77.9425ని తాకింది. అమెరికా మార్కెట్లలో డాలర్ ఇండెక్స్‌ తగ్గినట్లే తగ్గి నిన్న మళ్ళీ 103స్థాయిని దాటింది. అలాగే పది సంవత్సరాల అమెరికా బాండ్లపై ఈల్డ్స్‌ 3 శాతం దాటాయి. వీటికి తోడు బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 122 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. రష్యా నుంచి అధిక క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేయాలన్న భారత్‌ ప్రయత్నాలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అధిక రేట్లతో క్రూడ్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటిన్నింటి కారణంగా డాలర్‌తో రూపాయి మరింత నష్టపోయే అవకాశముంది.